English   

బిగ్ బాస్ సీజన్ 4 లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్స్..

Bigg Boss telugu
2020-12-16 11:27:48

బిగ్ బాస్ సీజన్ 4 నిర్వహకులు చివరి వారం ఎంటర్ టైన్మెంట్‌‌ కోసం మాజీ కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దించారు. హరితేజ గీతా మాధురి శ్రీముఖి అలీ రెజాల ఇంటి సభ్యులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చి కాసేపు ఆట పట్టించారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 4కి గత సీజన్లకు ఉన్న వ్యత్యాసాలను తెలియజేశారు. సీజన్ 1 అప్పుడు అయితే చాలా కష్టపడ్డామని.. ఫుడ్ సరిగా ఉండేది కాదని చెప్పిన హరితేజ.. సీజన్ 4లో బిర్యానీలు, ఐస్ క్రీమ్‌లు తింటుంటే మీము ఏం చేశామని మాకు ఇవ్వలేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మిక్సీ గ్రైండర్‌లు.. చికెన్ మటన్‌లు.. మేమేమో దంచుకుని వంట చేసుకునే వాళ్లం.. మీకు మిక్సీ గ్రైండర్‌లు మీ కథ అంతా వేరే ఉంది అంటూ సరదా సరదాగా మాట్లాడారు. వీళ్ల డిస్కషన్స్‌లో అరియానా ఓవరాక్షన్, అఖిల్-మోనాల్‌ల లవ్ స్టోరీ, అఖిల్ హారిక చేతిపై ఏదో రాసిన మ్యాటర్, అతని పులిహోర పంచాయితీ వీటిన్నింటిపైనా సరదా ముచ్చట్లు నడిచాయి. రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ఆటలో టాప్ 5 కంటెస్టెంట్స్‌తో మాట్లాడే అద్భుత అరుదైన అవకాశాన్ని ఇచ్చినందుకు బిగ్ బాస్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.

More Related Stories