English   

అభిజిత్ జర్నీ..బిగ్ బాస్ సీజన్ 4కే హైలైట్

Abhijeet
2020-12-17 13:08:09

బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనలిస్ట్ లకు తమ జర్నీని చూపించారు బిగ్ బాస్.  ప్రతీ సీజన్‌లో స్పెషల్ రూం ఒకటి ఏర్పాటు చేసి... అందులో టాప్ 5 కంటెస్టెంట్లకు తమ తమ జర్నీ వీడియోలను చూపించేవాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసి చూపించారు. వాటిని చూసిన ఒక్కో కంటెస్టెంట్ ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్ జర్నీ వీడియో బిగ్ బాస్ కే హైలైట్ అయ్యింది. యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన అభిజిత్.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ కూడా సాధించారని చెప్పారు బిగ్ బాస్. మిగిలిన వాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా.. మీరు మాత్రం అన్నింటిని తట్టుకుని ఉన్నారు.ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్ని మరెన్నో బంధాలను ఏర్పరచుకున్నారని చెప్పారు. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నాడని చెప్పారు బిగ్ బాస్.అనంతరం నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే అంటూ భావోద్వేగానికి గురయ్యాడు అభిజిత్.

More Related Stories