English   

బిగ్ బాస్ 4..మరోసారి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్

Chiranjeevi
2020-12-18 11:45:35

ఈ ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్-4 పూర్తికానుంది. దాంతో ఈసారి విన్నర్ ఎవరవుతారన్నదానితో పాటు గ్రాండ్ ఫినాలే కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది.  అయితే సోషల్ మీడియాలో మొదట ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబులలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపించాయి. గతంలో చిరు వచ్చారని అంతకు ముందు సీజన్ కు ఎన్టీఆర్ వచ్చారని..ఈసారి మహేష్ బాబు వస్తారని చాలానే లెక్కలు వేశారు. ఇక కాగా తాజాగా చీఫ్ గెస్ట్ ను నిర్వహకులు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ లో మళ్ళీ మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేయబోతున్నట్టు స్ఫష్టమైంది. 

ఇదిలా ఉండగా గత సీజన్ కు కూడా మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దాంతో బిగ్ బాస్ ఫినాలే కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రావడం ఇది రెండోసారి. మెగాస్టార్ ఎంట్రీతో గత సీజన్ టిఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగింది. మరి ఈ సారి చిరు ఏమేరకు రచ్చ చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా విన్నర్ పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగిరిలో అభిజిత్ విన్నర్ గా నిలుస్తాడాని పోల్స్ చెబుతున్నాయి. అంతే కాకుండా సోహెల్ ఈ సారి రన్నరప్ గా నిలుస్తాడని అంచనా వేస్తున్నారు. మరోవైపు అఖిల్ సార్ధక్ కు కూడా భారీగానే అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక అరియనా..హారిక లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిలో విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

More Related Stories