English   

రకుల్ వల్ల 4 కోట్లు నష్టం

Suriya's NGK MOvie Producers 4 Cr Loss For Rakul Preeth Singh
2018-09-08 08:56:50

ర‌కుల్ ప్రీత్ సింగ్ అంటే హీరోయిన్ గానే అంద‌రికీ తెలుసు కానీ ఆమెలో ఫిట్ నెస్ ప్రీక్ మాత్రం భీభ‌త్సంగా ఉంటుంది. ఓ రోజు అన్నం తిన‌కుండా ఉంటుందేమో కానీ జిమ్ చేయ‌కుండా మాత్రం ఉండ‌లేదు. అస‌లు జిమ్ లేక‌పోతే ప్రాణాలు తీసేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఒక్క‌రోజు కూడా ఫిట్ నెస్ పై దృష్టిపెట్ట‌కుండా ఉండ‌టం ర‌కుల్ చ‌రిత్ర‌లోనే లేదు. ఆమె బిజినెస్ కూడా ఇదే. అందుకే క‌దా ఇక్క‌డ సంపాదించిన కోట్లు కూడా తీసుకెళ్లి ఎఫ్ 45 అంటూ మ‌ళ్లీ అందులోనే పోసింది. ఈమెకు ఒక్క మాట‌లో చెప్పాలంటే సినిమాల కంటే కూడా జిమ్ ఎక్కువ‌. జిమ్ పేరుతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. హీరోలే నిర్మాత‌ల కోసం స‌ర్దుకుపోతుంటే ఈ భామ మాత్రం ల‌క్స‌రీలు కావాల‌ని గొంతెమ్మ కోర్కెలు కోరుకుంటుంది. ఇప్పుడు సూర్య సినిమాకు కూడా ఇదే ప్రాబ్ల‌మ్ గా మారింది. ఈమె న‌టిస్తున్న ఎన్ జి కే సినిమా షూటింగ్ అంబ‌స‌ముద్రం అనే గ్రామంలో జ‌రగాలి. త‌మిళ‌నాడులోని చిన్న గ్రామంలో ఏ స‌దుపాయాలు ఉండ‌వు.

హైద‌రాబాద్ నుంచి ర‌కుల్ అక్కడికి వెళ్లాలంటే చాలా దూరంతో పాటు శ్ర‌మ కూడా పడాల్సి వస్తుంది. దాంతో రాలేన‌ని చేతులెత్తేసింది ఈ బ్యూటీ. ఇక చేసేదేం లేక ఇప్పుడు ర‌కుల్ కోస‌మే ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ లోనే అంబ‌స‌ముద్రంను త‌ల‌పించే సెట్ వేయించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నిర్మాత‌ల‌ను బాగా చూసుకోడానికి హీరోలే ఓ మెట్టు దిగుతున్న‌పుడు ర‌కుల్ కు ఏమైంది..? వాళ్ల‌ను అర్థం చేసుకునే బాధ్య‌త ర‌కుల్ పై లేదా..? రకుల్ అవేవీ ప‌ట్టించుకోకుండా కేవ‌లం త‌న జిమ్ కోస‌మ‌ని నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెడుతుందని టాక్. తెలుగు ఇండ‌స్ట్రీలో ఫిట్ నెస్ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టే హీరోయిన్స్ లో ర‌కుల్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఎప్పుడూ జిమ్ లోనే చెమ‌ట‌లు క‌క్కుతూ ఉంటుంది ఈ భామ‌. అందుకే ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌లో పిచ్చెక్కిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌, అన్న‌ట్లు ఎన్జికేలో ర‌కుల్ తో పాటు సాయిప‌ల్ల‌వి కూడా న‌టిస్తుంది. మ‌రోవైపు ఈ చిత్ర హీరో సూర్య.. కేవీ ఆనంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏదేమైనా ర‌కుల్ జిమ్ ఖ‌ర్చు ఇప్పుడు 4 కోట్లు అన్న‌మాట‌.

More Related Stories