English   

కబీర్ సింగ్ దెబ్బకి 40 కోట్లకి రెమ్యునరేషన్ పెంచేశారా ?

Shahid Kapoor
2019-07-25 15:22:05

తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ టైటిల్‌తో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా విడుదలైన నాటి నుండే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 130 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ కి చేరువలో వుంది. కబీర్ సింగ్ ను కూడా అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా హీరో షాహిద్ కపూర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి పేరు, క్రేజ్ తెచ్చిపెట్టింది. ఐతే ఈ సినిమా విజయం తర్వాత అమాంతం షాహిద్ తన రేటు పెంచేసినట్టుగా చెబుతున్నారు. షాహిద్ ఏకంగా 40 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'జెర్సీ' సినిమాని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం షాహిద్ ని సంప్రదించగా దిమ్మతిరిగిపోయే రేట్ చెప్పాడట. ఇప్పుడీ విషయం బీ టౌన్ తో పాటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ జాతీయ మీడియా సైతం కధనాలు ప్రచురిస్తోంది. 

More Related Stories