English   

40 ఏళ్ల బాకీ తీర్చి నిర్మాత.. షాక్ అయిన మాజీ హీరోయిన్.. 

Actress Sharada
2019-10-19 15:57:48

తెలుగు నటి శారద అంటే కేవలం మనకే కాదు.. సౌత్ ప్రేక్షక లోకానికి మొత్తం తెలుసు. అందులోనూ మలయాళ సినిమాల్లో ఆమె ఓ సంచలనం. అక్కడే ఆమెకు ఊర్వశి పురస్కారం కూడా లభించింది. అందుకే ఆమెను ఊర్వశి శారద అంటారు. అక్కడ వందల సినిమాలు చేసింది శారద. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈమెకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. 40 ఏళ్ళ క్రితం ఈమె 'పుష్యరాగం' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని వీవీ ఆంటోని నిర్మించారు. శారదతో పాటు సినిమాలో శ్రీవిద్య కూడా నటించారు. అయితే పుష్యరాగం సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో శారదతో పాటు శ్రీవిద్యకు కూడా పారితోషికం ఇవ్వలేకపోయాడు ఆంటోనీ. ఇప్పుడు ఇండస్ట్రీలో డబ్బులు రాకపోతే పోయినట్లే అంటారు కదా కానీ ఆంటోనీ మాత్రం అలా అనుకోలేదు. బాకీ ఎప్పుడైనా బాకీ అనుకున్నాడు. అందుకే ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 40 ఏళ్ళ తర్వాత శారదకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గుర్తు పెట్టుకుని ఈ మధ్యే ఆమెకు ఇచ్చేసాడు ఆంటోనీ. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక శారద కూడా తను మరిచిపోయిన మొత్తాన్ని మళ్లీ తీసుకొచ్చి నిర్మాత ఆంటోనీ ఇవ్వడంతో షాక్ అయిపోయింది. ఇదే విషయాన్ని సన్నిహితులకు చెప్పి సంతోషపడుతుంది శారద. ఈ ఇద్దరూ ఈ మధ్యే ఒకే వేడుకలో కలుసుకున్నారు. అక్కడే తన మొత్తాన్ని ఇచ్చేసాడు ఆంటోనీ. ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిర్మాతలు ఉన్నారు కాబట్టే ఇండస్ట్రీ ఇంకా ఇంత బాగా వెళ్తుంది. ఏదేమైనా ఇది చాలా గొప్ప విషయమే. 

More Related Stories