English   

40 ల్లో చూపిస్తున్న భూమిక.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

bhumi
2019-11-19 05:17:11

భూమిక చావ్లా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిలీనియం మొదట్లో వరుస సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. సుమంత్ హీరోగా 2000లో వచ్చిన యువకుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది భూమిక. ఆ తర్వాత ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించి భూమిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన తేరే నామ్ అప్పట్లో సంచలనం. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పూర్తిగా వెనకబడిపోయింది భూమిక. జై చిరంజీవ సినిమా తర్వాత తెలుగులో తన ఇమేజ్ ను కోల్పోయింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంటూ ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

అదే సమయంలో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో హీరోకి వదిన పాత్రలో నటించింది భూమిక. యూ టర్న్, సవ్యసాచి చిత్రాలలో కూడా మంచి పాత్రలు చేసింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో భూమిక పెట్టిన ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. 41 ఏళ్ల వయసులో ఈ బ్యూటీ హాట్ ఫొటోలతో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఉన్నట్టుండి ఇలా హాట్ ఫోటోలు షేర్ చేయడం వెనుక అసలు రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే హీరోయిన్ గా నటించాలని కోరుకుంటోంది ఏమో మరి.. కానీ అవకాశం ఇచ్చే దర్శకుడు ఎక్కడున్నాడు..

More Related Stories