English   

400 మంది పవన్ పార్టీ వారి అకౌంట్స్ స‌స్పెండ్ చేసిన ట్విట్ట‌ర్‌

janasena
2019-09-18 19:33:34

జనసేన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన దాదపు 400 ట్విట్టర్ ఖాతాలు సస్సెండ్ అయ్యాయి. జనసేనకు మద్దతుగా పని చేసే, శతఘ్ని టీంకు చెందిన ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. అయితే ఇది ఏపీ ప్రభుత్వం చేతివాటమే అని పవన్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ తనకు నచ్చని న్యూస్ ఛానెళ్లు, ట్విట్టర్ ఖాతాలను టార్గెట్ చేశారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. జనసేనను చూసి వైసీపీ భయపడుతోందని చెబుతూ ట్రోల్ చేస్తూన్నారు. కొద్ది రోజులుగా జ‌న‌సైనికులు పవ‌న్ యురేనియం పిలుపు మేర‌కు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు.

 వైస్ జ‌గ‌న్ ఫేయిల్డ్ సీఎం అనే పేరుతొ పాటు సేవ్ న‌ల్ల‌మ‌ల అనే యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. బహుశా దాని కోసమే ట్విట్టర్ అకౌంట్స్ బ్లాక్ చేయించారని భావిఒస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేనకు మద్దతుగా ఉన్న 400 ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. ప్రజల సమస్యల్ని తెలుసుకొని అండగా నిలబడటం దీనికి కారణమా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’అంటూ పవన్ ట్వీట్ చేశారు. #BringBackJSPSocialMedia అంటూ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు.

More Related Stories