English   

42 ఏళ్ల వయసులో తల్లి అయిన హీరోయిన్..

sangavi
2020-05-17 16:47:25

ఈ మధ్య పెళ్లిళ్ళే 40 ఏళ్లకు చేసుకుంటున్నారు. అందుకే పేరెంట్స్ కావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ముఖ్యంగా మన హీరో హీరోయిన్లు అయితే 40 దాటిన తర్వాత కూడా అమ్మ నాన్న అవుతున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సంఘవి విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమె కూడా ఇప్పుడు 4 పదులు దాటిన తర్వాత అమ్మ అయింది సంఘవి. తెలుగులో ఈ భామకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో వరస సినిమాలు చేసింది కూడా. దానికి తోడు రామానాయుడు బ్యానర్ లో చాలా సినిమాలు చేసింది సంఘవి. లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పిల్లలను కూడా లేటుగానే కనేస్తుంది. కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో అల్లరి పిల్లగా ఆకట్టుకుంది సంఘవి.

ఆ తర్వాత వెంటనే చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ, రాజశేఖర్, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, జగపతిబాబు, శ్రీకాంత్ ఇలా అప్పటి టాప్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసింది ఈ భామ. తమిళనాట కూడా విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది సంఘవి. తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పటి వరకు దాదాపు 55 సినిమాలకు పైగానే నటించింది ఈమె. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని హాయిగా గడుపుతున్న సంఘవి తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సంఘవి వయసు 42. తన పాపతో కలిసి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ వయసులో తల్లైన సంఘవిని చూసి కొందరు షాక్ అవుతున్నారు.

 

More Related Stories