బాపురే.. 44 ఏళ్లలో క్యా షేపురే @ అమీషా పటేల్..

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పోజులను చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది మరి. తెలుగులో అమీషా పటేల్ అనేదాని కంటే కూడా బద్రి బ్యూటీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు ప్రేక్షకులు. ఎందుకంటే నటించింది తక్కువ సినిమాలే అయినా ఆమె కెరీర్ లో ఉన్న హిట్ సినిమా మాత్రం ఇదొక్కటే. అందులో పవన్ సరసన చాలా పద్దతిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అంత పద్దతిగా మడి కట్టుకుని కూర్చునే బ్యాచ్ మాత్రం అమీషా పటేల్ కాదు.. ఏదో కారెక్టర్ కొత్తగా ఉందని అలా చేసింది కానీ ఆ తర్వాత మాత్రం చాలా రచ్చ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది.
44 ఏళ్లలో కూడా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లకునేలా ఫిగర్ మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది ఈ భామ. బద్రిలో ఆమెతో పాటు నటించిన రేణుదేశాయ్ హాయిగా సినిమాలకు దూరంగా కుటుంబ జీవితం గడుపుతుంది. కానీ అమీషా పటేల్ మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉంది. కహో నా ప్యార్ హై లాంటి సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అమీషా.. కొన్నాళ్లు అక్కడ బాగానే వెలిగిపోయింది. తెలుగులోనూ నాని, నరసింహుడు, పరమవీరచక్ర లాంటి సినిమాల్లో నటించింది. కానీ బద్రి మినహా అన్నీ డిజాస్టర్లే.
వయసు 40కి చేరిపోవడంతో అవకాశాలు కూడా దూరమవుతూ వచ్చాయి. కానీ ఈమె మాత్రం ఇప్పటికీ హీరోయిన్ వేషాల కోసం ట్రై చేస్తూనే ఉంది. తాజాగా ఓ ఫోటోషూట్ చేసిన అమీషా.. అందులో అందాల విందు చేసింది. క్లీవేజ్ షోలతో మతులు పోగొట్టేసింది. ఈ భామ జోరు చూస్తుంటే కుర్ర హీరోయిన్లు కూడా వామ్మో అనాల్సిందేనేమో..! ఇప్పటికీ అడపాదడపా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది అమీషా. హమేషా అవకాశాలు రావాలంటే కష్టమే కానీ ఇప్పటికీ ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది అమీషా. మొత్తానికి ఏజ్ పెరిగినా.. గ్లామర్ షోలో మాత్రం తనను కొట్టే వాళ్లే లేరని నిరూపించే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.