English   

44 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షలు రాసిన టాలీవుడ్ నటి హేమ..

Actress Hema
2020-09-28 14:18:35

చదువుకి వయస్సుతో అసలు సంబంధం లేదు.. మనసులో చదువుకోవాలని ఉంటే ఎప్పుడూ ఎక్కడైనా చదువుకోవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చు. అందులో సిగ్గు పడాల్సిన అవసరం అవసరం లేదు. ఇదే విషయాన్ని మన పెద్ద వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు. ఎంతో మందికి చదువుకోవాలని ఉన్నా కూడా ఆ వయసులో కొన్నిసార్లు కుదరదు. తీరా వయసు తర్వాత చదువుకునే ఓపిక ఉండదు. కాని కొందరు మాత్రం తాము అనుకున్నది సాధించగలరని నిరూపిస్తుంటారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. వయసు దాటిపోయినంత మాత్రాన తన చదువుకు అది అడ్డం కాదు అంటుంది. 

డిగ్రీ పట్టా పొందేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి దరఖాస్తు చేసుకున్న హేమ… నల్గొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో పరీక్షలు రాసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నానని.. కానీ కెరీర్ విషయంలో బిజీగా ఉండటంతో కుదరలేదు అని చెప్పింది. మరోవైపు డిగ్రీ పరీక్షలు హైదరాబాద్లో రాస్తే తనను గుర్తు పట్టి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నల్గొండలో పరీక్షలు రాసినట్లు చెప్పుకొచ్చింది హేమ. పైగా నల్గొండలో తమ బంధువులు ఉన్నారని.. అందుకే అక్కడ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది హేమ. ఏదైనా కూడా ఈ వయసులో డిగ్రీ పరీక్షలు రాసిన హేమను చూసి చాలామంది మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

More Related Stories