English   

సల్మాన్ ఖాన్ పారితోషికం 450 కోట్లా.. ఏంటి రాజా ఈ అరాచకం..

Salman Khan
2020-07-08 08:10:20

షో చేస్తున్నాడా లేదంటే షోను కొంటున్నాడా..? ఇప్పుడు ఈ లెక్క‌లు చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా వ‌చ్చే మొద‌టి అనుమానం ఇదే. ఇంత‌కీ ఎవ‌రు ఇంత‌గా తీసుకుంటున్న‌ది అనుకుంటున్నారా..? ఇంకెవరు ఉన్నాడు క‌దా మ‌న‌కు కండ‌ల‌వీరుడు ఆఫ్ ఇండియా.. స‌ల్మాన్ ఖాన్. ఈయ‌నే బిగ్ బాస్ కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఎపిసోడ్ కు 16 కోట్లు తీసుకుంటున్నాడు ఈయ‌న‌. సీజ‌న్ 13 కోసం 12 కోట్లు తీసుకున్న ఈయ‌న‌.. ఇప్పుడు మ‌రో 4కోట్లు పెంచాడు. వ‌ర‌స‌గా 13 సీజ‌న్స్ నుంచి ఈయ‌నే హోస్ట్ గా ఉన్నాడు. దాంతో ఈయ‌న్ని మార్చ‌డం ఇష్టం లేక అడిగినంత ఇచ్చేస్తున్నారు షో నిర్వాహ‌కులు.  మొత్తం 28 ఎపిసోడ్ల‌కు గానూ 14 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడు కండ‌ల‌వీరుడు. 

అంటే రోజుకు రెండు ఎపిసోడ్లు అన్న‌మాట‌. అలా 14 రోజుల‌కు ఏకంగా 448 కోట్లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సీజన్ మొత్తం 100 రోజులు నడవనుంది. ఈ సీజన్ కోసం 450 కోట్లు అంటే దాదాపు హాలీవుడ్ స్టార్స్ తో స‌మానం. అక్క‌డ కూడా అంతే.. ఒక్కో షోకు ఆస్తులు రాయించేసుకుంటారు స్టార్స్. ఇక్క‌డ స‌ల్మాన్ అది చేసి చూపిస్తున్నాడు. అయితే ఎంత ఇచ్చినా రేటింగ్స్ రూపంలో బిగ్ బాస్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ కాంట్ర‌వ‌ర్సీ షోగా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటుంది. ఇదే స‌ల్మాన్ కు కొండంత బ‌లాన్నిస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా 'రాధే'తో పాటు 'కభీ ఈద్ కభీ దీవాళి' సినిమాలు చేస్తున్నాడు.

More Related Stories