English   

మలైకా అరోరా ఆన్ ఫైర్.. రెచ్చగొడుతున్న 47 ఏళ్ల బ్యూటీ.. 

 Malaika Arora Khan
2019-11-14 17:26:23

మ‌లైకా అరోరా.. ఈ పేరు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ కెవ్వుకేక అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. హిందీలో ఛ‌య్య ఛ‌య్య అంటూ ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం రాత్రైనా నాకు ఓకే అంటూ మ‌హేశ్ తో.. కెవ్వుకేక అంటూ ప‌వ‌న్ తో చిందేసింది. ఈ రెండు పాట‌లు సూప‌ర్ హిట్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కు ప్ర‌త్యేత గుర్తింపు తెచ్చింది మ‌లైకా. హీరోయిన్ల‌తో స‌మానంగా ఇప్ప‌టికీ ఈ భామ‌కి చాలా క్రేజ్ ఉంది. వ‌య‌సు 50కి చేరువవుతున్నా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ల‌కునే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది మ‌లైకా. ఇక ఇప్పుడు మ‌ళ్లీ త‌న అందంతో ర‌చ్చ చేసింది మ‌లైకా. 

ఆ మ‌ధ్య భ‌ర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ.. అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ న‌డుపుతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడగొడుతుంది మ‌లైకా. 43 ఏళ్ల వ‌య‌సులో తాజాగా మ‌లైకా మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది. ఆ మధ్య స్విమ్మింగ్ పూల్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి ఆహా ఓహో అనుకుంటూ లొట్ట‌లేస్తున్నారంతా. ఇక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఏజ్ పెరుగుతున్నా కూడా త‌న‌లో ఇంకా వ‌న్నె త‌ర‌గ‌లేద‌ని నిరూపిస్తూ కెవ్వుకేక పెట్టిస్తుంది మ‌లైకా అరోరాఖాన్.

More Related Stories