47ఏళ్ళు వచ్చినా సితార అందుకే పెళ్లి చేసుకోలేదట

ఇప్పటి హీరోయిన్ లు పెళ్లి చేసుకోవడానికి వయస్సు మీదపడేవరకు వేచి చూస్తున్నారు... కానీ ఒకప్పటి హీరోయిన్ లు మాత్రం చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసుకునేవారు. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన నటి సితార మాత్రం 47ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా తాజాగా సితార తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన తండ్రి అన్ని విషయాల్లో తనకు మద్దతుగా నిలిచేవారని సితార తెలిపింది. ప్రతి విషయంలోనూ తన తండ్రి సలహాలు ఇచ్చేవారని పేర్కొంది. అలాంటి తండ్రి హఠాత్తుగా మరణించడం తనను షాక్ కు గురిచేసిందని చెప్పింది. ఆ తరవాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరమయ్యానని...అలా చూస్తుండగానే సమయం గడిచిపోయిందని పేర్కొంది. దాంతో పెళ్లిపై ఆలోచనలు రాలేదని తెలిపింది. భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని పేర్కొంది.