English   

ఇస్మార్ట్ శంక‌ర్ 5 డేస్ క‌లెక్ష‌న్స్.. డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్.. 

iSmart Shankar
2019-07-23 12:16:37

పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ఆక‌లి మొత్తం ఒకేసారి తీర్చేసుకుంటున్నాడు. ఈయ‌న తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా బాక్సాఫీస్ పై క‌సితీరా దండ‌యాత్ర చేస్తుంది. వీక్ డేస్ లో కూడా అస్స‌లు వీక్ కావ‌డం లేదు ఈ చిత్రం. ఇప్ప‌టికీ అదే దూకుడు కొన‌సాగుతుంది. సోమ‌వారం రోజు కూడా ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 2.5 కోట్ల షేర్ వ‌సూలు చేసిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే సినిమా ఐదు రోజుల్లోనే 27 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా 9కోట్లు అద‌నంగా తీసుకొచ్చాడు శంక‌ర్. ఇదే దూకుడు కొన‌సాగితే మ‌రో 10 కోట్లు కూడా తెచ్చేలా క‌నిపిస్తున్నాడు. డియ‌ర్ కామ్రేడ్ వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇస్మార్ట్ శంక‌ర్ దండ‌యాత్ర ఆగేలా క‌నిపించ‌డం లేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా లేక‌పోవ‌డం దీనికి బాగా క‌లిసొస్తుంది. మ‌రోవైపు రామ్ మాస్ అవ‌తారం.. పూరీ మార్క్ తెలంగాణ డైలాగులు థియేట‌ర్ల‌లో గోల పెట్టిస్తున్నాయి. దాంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయింది. ఈ దూకుడు చూస్తుంటే అస‌లు రామ్ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. కానీ ఇక్క‌డ రామ్ ఫ్యాన్స్ కంటే కూడా పూరీ ఫ్యాన్స్ ఎక్కువ‌గా పండ‌గ చేసుకుంటున్నారు. మాస్ సినిమాల‌కు టాక్ బాగా వ‌స్తే క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ చూపిస్తున్నాడు. ఫుల్ ర‌న్ లో ఈజీగా 40 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది ఈ చిత్రం. 

More Related Stories