English   

తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 డిజాస్టర్స్ ఏంటో తెలుసా..

Tollywood
2019-09-28 13:21:23

దాదాపు 9 దశాబ్ధాల తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో వేల సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని వేల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా సినిమాలు నిర్మాతలను, బయ్యర్లను దారుణంగా ముంచేసాయి. అందులో కొన్ని మాత్రమే పూర్తిగా నష్టాలు తీసుకొచ్చాయి. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 5 టాప్ డిజాస్టర్స్ లెక్కేయడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. నిర్మాతలను అవి ముంచిన లెక్కల ప్రకారం కొన్ని సినిమాలు మాత్రం బయటికి వచ్చాయి. అందులో సాహో, అజ్ఞాతవాసి, స్పైడర్, ఎన్టీఆర్ బయోపిక్, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ చిత్రాలు బయ్యర్లను నిలువునా ముంచేసాయి. రిలీజ్ కు ముందే ఆకాశమంత హైప్ తో వచ్చిన ఈ చిత్రాలు వచ్చిన తర్వాత పాతాళంలోకి పడిపోయాయి. 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు అన్ని భాషల్లో 222 కోట్ల రూపాయల షేర్ తీసుకొచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 78 కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. కేవలం 57 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఈ సినిమాను కొన్నందుకు దాదాపు 65 కోట్లు నష్టపోయారు బయ్యర్లు. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ కూడా అంతే. తెలుగు, తమిళం భాషల్లో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. వచ్చింది మాత్రం 53 కోట్లే. డిస్ట్రిబ్యూటర్లకు 64 కోట్ల నష్టం తీసుకొచ్చింది స్పైడర్. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమా 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. 20 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే బయ్యర్లకు 50 కోట్లకు పైగా నష్టాలే మిగిల్చింది ఎన్టీఆర్ బయోపిక్. మొత్తానికి ఇంత దారుణమైన డిజాస్టర్స్ రాకుండా ఉంటేనే ఇండస్ట్రీ బాగుండేది. 

More Related Stories