English   

బాక్సాఫీస్ దగ్గర వార్ సంచలనాలు.. 5 రోజుల్లోనే 160 కోట్లు.. 

War
2019-10-07 16:41:54

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన సినిమా వార్. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బాలీవుడ్ లో బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే ఏకంగా 53 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కూడా దసరా సెలవులను పక్కాగా వాడుకుంటుంది వార్. రెండో రోజు 21.. మూడో రోజు 24.. నాలుగో రోజు 27 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక ఐదోరోజు ఆదివారం కూడా కావడంతో 30 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. 5 రోజుల్లోనే హిందీలోనే 150 కోట్లకు పైగా వసూలు చేసింది వార్. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 180 కోట్లకు పైగా వసూలు చేసి హృతిక్, టైగర్ ష్రాఫ్ కెరీర్లో టాప్ ఓపెనింగ్ గ్రాసర్ గా నిలిచింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ప్రేక్షకులు వార్ కు ఫిదా అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా చాలా రోజుల తర్వాత హృతిక్ నుంచి పూర్తిస్థాయి యాక్షన్ సినిమా రావడంతో పండగ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ సినిమా దెబ్బకు సైరా నరసింహా రెడ్డి బాలీవుడ్ లో కనీసం సీన్ లో కూడా కనిపించడం లేదు. 
 

More Related Stories