English   

ఎంత మంచివాడవురా 5 డేస్ కలెక్షన్స్

em
2020-01-21 05:04:51

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎంత మంచివాడవురా.  ఔట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు పోటి ఉన్నా ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేసింది యూనిట్. అయితే ఈ సినిమా వర్క్‌ అవుట్ కాలేదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ కూడా ఆశించిన స్థాయిలో లేవు. భారీ చిత్రాలు పోటి ఉండటంతో థియేటర్లు కూడా పెద్ద సంఖ్యలతో దొరకలేదు. దీనికి తోడు సినిమా మీద మంచి టాక్ లేకపోవడంతో తొలి రోజు కేవలం 2.16 కోట్ల షేర్‌ మాత్రమే సాధించగలిగింది. సంక్రాంతి రోజు రిలీజ్ కావడం వలన మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి.  ఎంత మంచివాడవురా’ ఆంధ్ర – తెలంగాణ 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్: నైజాం – 1.41 కోట్లు, సీడెడ్ – 78 లక్షలు, గుంటూరు – 63.3 లక్షలు, ఉత్తరాంధ్ర – 72.4 లక్షలు, తూర్పు గోదావరి – 89 లక్షలు, పశ్చిమ గోదావరి – 61.6 లక్షలు, కృష్ణా – 65.2 లక్షలు, నెల్లూరు – 22.3లక్షలు అలా ఐదు రోజుల మొత్తం షేర్ – 5.92 కోట్లు కాగా కర్ణాటక + ఇండియా – 27.3 లక్షలు, ఓవర్సీస్ – 20 లక్షలు ఇక వరల్డ్ వైడ్ 5 డేస్ షేర్ – 6.39 కోట్లు సంపాదించింది. టాక్‌ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ముందు ముందు వసూళ్లు మరింతగా పడిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

 

More Related Stories