English   

అనసూయ బర్త్ డే స్పెషల్.. గుర్తుండిపోయిన 5 పాత్రలు..

anasuya
2020-05-15 07:25:19

అనసూయ అంటే ముందుగా యాంకర్ గుర్తుకొస్తుంది. కానీ ఈమెలో మంచి నటి కూడా ఉంది. ఇదే విషయాన్ని తెలుగు ఇండస్ట్రీకి ప్రతిసారి గుర్తు చేస్తుంది అనసూయ. యాంకర్ మాత్రమే కాదు అద్భుతమైన నటి కూడా ఉందని వచ్చిన ప్రతిసారి నిరూపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మే 15న ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అనసూయ నటించిన సినిమాల్లో ఆమె పోషించిన పాత్రల్లో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన కొన్ని కారెక్టర్స్ ఓసారి చూద్దాం..

సోగ్గాడే చిన్నినాయనా..
నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనాలో మరదలు పాత్రలో నటించింది అనసూయ. ఈ పాత్ర ఉండేది కేవలం కొన్ని నిమిషాలు అయినా కూడా అనసూయ సినిమా ఎంట్రీ బాగానే జరిగింది. యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత తొలిసారి స్క్రీన్ పై అనసూయ కనిపించిన సినిమా ఇదే.

క్షణం..
అడవి శేష్ కథ స్క్రీన్ ప్లే మాటలు అందించిన అందించిన సినిమా క్షణం. రవికాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇందులో నెగిటివ్ పాత్రలో నటించింది అనసూయ. ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అనసూయలో మంచి నటి ఉందని గుర్తు చేసిన సినిమా క్షణం..

రంగస్థలం..
అప్పటి వరకు కేవలం గ్లామర్ కోణంలో చూసినా అనసూయను మరో కోణంలో చూపించిన సినిమా రంగస్థలం. సుకుమార్ ఏ క్షణంలో అనసూయను రంగమ్మత్త పాత్రకు అనుకున్నాడో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఈ సినిమా. అలాగే అనసూయ పాత్ర కూడా.. ఇప్పటికీ ఆమెను రంగమ్మత్త అంటున్నారు అభిమానులు.

యాత్ర..
యాత్ర సినిమాలో కూడా ఒకే ఒక్క సీన్ లో నటించింది అనసూయ. కానీ ఈ సీన్ అందరికీ గుర్తుండిపోవడం ఖాయం. రాయలసీమ ఎమ్మెల్యే గౌరు సుచరితారెడ్డి పాత్రలో ఇందులో నటించింది అనసూయ. కేవలం పది నిమిషాలు స్క్రీన్ స్పేస్ ఉన్న ఈ పాత్ర సినిమాలో కీలకం. చాలా సీరియస్ గా ఉండే ఈ పాత్రలో అద్భుతంగా నటించింది అనసూయ..

గాయత్రి..
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన గాయత్రి సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది అనసూయ. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇలా వరుసగా మంచి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. మొన్నామధ్య విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన మీకు మాత్రమే చెప్తాలో కూడా మంచి పాత్రే చేసింది అనసూయ. ఇక ఇఫ్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి హీరోలతో కలిసి నటిస్తుంది అను.

 

More Related Stories