English   

మాస్టర్ థియేటర్ హౌస్ ఫుల్..5 వేలు ఫైన్ 

Thalapathy vijay
2021-01-13 18:09:17

తమిళ టాప్ హీరోలలో విజయ్ కూడా ఒకరు. తాజాగా విజయ్ నటించిన "మాస్టర్" థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై ముందు నుండి చర్చ నడుస్తూనే ఉంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ కు అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50 శాతమే సీటింగ్ కు అనుమతిచ్చింది. కానీ కోర్టు ఆదేశాలను కొన్ని థియేటర్ల యజమాన్యాలు లెక్క చేయనట్టు తెలుస్తోంది. మాస్టర్ సినిమా తో థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నట్టు టాక్ నడుస్తోంది. 

మల్టిప్లెక్సుల్లో సైతం టికెట్లు దొరకని పరిస్థితి నెలకొందట. మల్టీ ప్లెక్సుల పరిస్థితేమో గాని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయట. టికెట్లన్నీ బ్లాక్ లోనే దొరుకుతున్నాయట. అంతే కాకుండా టికెట్ ధర రూ.500 పలుకుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక చెన్నై లో ఓ థియేటర్ ఆదేశాలను పట్టించుకోకుండా హౌస్ ఫుల్ గా షో నడుపుతున్నందున అధికారులు రూ.5000 జరిమానా విధించినట్టు ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. ఆయన థియేటర్ లో ప్రేక్షకుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక థియేటర్ లోనే జనాలు ఇలా ఉంటే. ఇంటర్ వెల్ సమయంలో సామాజిక దూరం దేవుడే ఎరగాలి.

More Related Stories