English   

ఉప్పెన 5 డేస్ కలెక్షన్స్

Uppena
2021-02-18 11:39:27

మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు. ఇక ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఒక డెబ్యూ మూవీ కి ఈ రేంజ్ లో క్రేజ్ రావడం విశేషం. ఈ సినిమాలోని పాటలే సినిమాకు పబ్లిసిటీగా మారాయి. అంతే కాకుండా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచలనాలను మరింత పెంచాయి. 

ఇక ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 20.5 కోట్ల వరకు జరగ్గా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. ఇక సినిమాకు ఐదవరోజు కూడా కలెక్షన్లు భాగానే వచ్చాయి. 5వరోజు 3.92 కోట్ల షేర్ ను ఈ సినిమా వసూలు చేసింది. దాంతో మొత్తం 5 రోజులవరకు ఈ సినిమా 34.60 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం విషషమనే చెప్పాలి. ఐదవరోజు కలెక్షన్లు ప్రాంతలవారిగా చూసుకుంటే  ఏపీ తెలంగాణలో 3.52 కోట్లు వసూలు చేయగా...కర్ణాటక, చెన్నై, ఓవర్సిస్, ఆర్వోఐ కలిపి మొత్తం 40 లక్షలు వసూలు చేసింది.

More Related Stories