English   

మార్చ్ 5న బరిలోకి డజన్ పైగా సినిమాలు

 tollywood
2021-03-04 15:30:04

కరోనా ఎఫెక్ట్ తో మూత పడిన థియేటర్లలో మెల్ల మెల్లగా సందడి మొదలవుతుంది. గతేడాది కొన్ని నెలలుగా మూతపడ్డ థియేటర్లు ఇటీవలే తెరుచుకోవడంతో సినీ ప్రేమికులు, ఫ్యాన్స్ థియేటర్ లలో సినిమాలు చూడటం మొదలు పెట్టారు. ఇక జనవరి లో వచ్చిన క్రాక్, ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా థియేటర్లకు మరింత ప్రాణం పోసాయి. ఈ జోష్ కొనసాగుతుండటం తో మార్చ్ 5న థియేటర్లలో ఏకంగా డజన్ కు పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సందీప్ కిషన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ఏ 1 ఎక్స్ప్రెస్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ కాగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక యంగ్ హీరో రాజ్ తరున్ నటించిన పవర్ ప్లే సినిమా కూడా ఇదే డేట్ కు రాబోతుంది. 

ఈ సినిమాను విజయ్ కుమార్ కొండా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అవును ఫేమ్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు ప్లే బ్యాక్ అనే సినిమా కూడా మార్చ్ 5 న బరిలోకి దిగబోతుంది. ఈ చిత్రానికి మహేష్ బాబు నెంబర్ 1 సినిమాకు కథ అందించిన హరి ప్రసాద్ జక్కా కథను అందిస్తున్నారు. అదే విధంగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన క్లైమాక్స్ సినిమా కూడా మార్చ్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కూడా మార్చ్ 5న బరిలో దిగనుంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. దాంతో మార్చ్ 5న థియేటర్ ల వద్ద పండగ వాతావరణం కనిపించనుంది. మరి వీటిలో ఏ సినిమాలు అంచనాలను రీచ్ అవుతాయో చూడాలి.

More Related Stories