English   

బిగ్ బాస్ సీజన్ 5 పై బిగ్ అప్డేట్

 Bigg Boss telugu
2021-05-08 20:04:58

అన్ని భాషలతో పాటు తెలుగులోనూ బిగ్ బాస్ కు మంచి ఆదరణ లభించింది. ఇపప్టికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.నాలుగో సీజన్ లో అన్నీ కొత్త ముఖాలే అయినా రేటింగ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. అంతే కాకుండా గంగవ్వ లాంటి విలేజ్ సెలబ్రెటీ ఉండటం వల్ల పల్లెలకు సైతం బిగ్ బాస్ క్రేజ్ వెళ్ళింది. దాంతో నిర్వాహకులు వీలైనంత త్వరగా బిగ్ బాస్ సీజన్ 5 ని ప్రారంభించాలని అనుకున్నారు. అంతే కాకుండా నెల రోజులకే పనులు కూడా ప్రారంభించారు. అప్పట్లో బిగ్ బాస్ ను మిస్ అవుతున్నారా..? అంటూ స్టార్ మా పోల్ ను కూడా నిర్వహించింది. ఆ పోల్ కు అనూహ్య స్పందన లభించింది. అయితే కరోనా కారణంగా ఇప్పట్లో బిగ్ బాస్ లేనట్టే ని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ను ఆగస్ట్ లో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్ ల ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కరోనా నేపథ్యంలో ముందుగా కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచి ఆ తరవాత హౌస్ లోకి పంపిస్తారట. ఇక ఈ సీజన్ కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

More Related Stories