English   

బిగ్ బాస్ సీజ‌న్5 పై రెండు అదిరిపోయే అప్డేట్ లు

Bigg Boss Telugu
2021-06-04 13:16:14

తెలుగు రియాలిటీ బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌ల్సిన‌వ‌స‌రం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ బిగ్ బాస్ నాలుగు సీజ‌న్ ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నాలుగో సీజ‌న్ కు గ‌త మూడు సీజ‌న్ల కంటే ఎక్కువ టీఆర్పీ వ‌చ్చింది. దాంతో నాలుగో సీజ‌న్ పూర్త‌యిన వెంట‌నే సీజ‌న్ 5 ను కూడా ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతితో కాస్త ఆల‌స్యం అయ్యింది. ఇక ఇప్పుడు సీజ‌న్ 5 కోసం బిగ్ బాస్ నిర్వాహ‌కులు అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే నేరుగా అభ్య‌ర్థుల‌ను క‌ల‌వ‌కుండా జూమ్ వీడియో కాల్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. 

అంతే కాకుండా వీలైనంత త్వ‌రగా బిగ్ బాస్ సీజ‌న్ 5 ను ప్రారంభించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జూలై లో షోను ప్రారంభించే దిశ‌గా అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే మాటీవీ ఆఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సీజ‌న్ కు కూడా నాగార్జున యే హోస్ట్ గా చేయ‌బోతున్నారు. అంతే కాకుండా అన్న‌పూర్ణ స్టూడియోలోనే మ‌ళ్లీ బిగ్ బాస్ హౌస్ ను ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఇక గ‌త సీజ‌న్ లో ప్రేక్ష‌కులు అభ్య‌ర్థుల విష‌యంలో ఎంతో నిరాశ చెందారు. కాబ‌ట్టి ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్ల విష‌యంలో మేక‌ర్స్ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ సీజ‌న్ ఎవ‌రెవ‌రిని మేక‌ర్స్ హౌస్ లోకి పంపిస్తారో చూడాలి. 

More Related Stories