బిగ్ బాస్5 హోస్ట్ గా యంగ్ హీరో

'బిగ్ బాస్' రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఒకటి. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తిచేసుకున్న ఈ షో ఐదో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 'బిగ్ బాస్' అనగానే అందరికీ వచ్చే ఆలోచన ఈసారి కంటెస్టెంట్ గా ఎవరు వస్తున్నారు. హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే సందేహాలు తలెత్తుతాయి. ఇప్పటికే కంటెస్టెంట్ లు గా కొంతమంది పేర్లు వినపడగా అవి వాస్తవమా కాదా అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు హోస్ట్ కు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు సీజన్ వన్ లో ఎన్టీఆర్, రెండో సీజన్లో నాని, మూడవ, నాలుగో సీజన్ లో నాగార్జున హోస్ట్ వ్యవహరించాడు. ఐదవ సీజన్ లో కూడా నాగార్జున నే ఈ బాధ్యతలు చేపడతాడు అని వార్తలు వచ్చినప్పటికీ...ప్రస్తుతం నాగార్జున సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల ఈసారి దగ్గుబాటి రానాను హోస్ట్ గా తీసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహక బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం కావాల్సిందే.