English   

రామ్ చ‌ర‌ణ్ గుడ్ డిసీజన్...నో చెప్పిన 5 సినిమాల్లో 3 ఫ్లాప్

Ram Charan
2021-05-29 20:02:54

మెగాస్టార్ త‌న‌యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ హీరోగా ఎదిగారు. వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే చ‌ర‌ణ్ క‌థ‌ల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేయ‌డం వ‌ల్లే ఈ స్థాయికి చేరుకున్నార‌ని ఆయ‌న రిజెక్ట్ చేసిన సినిమాలు చూస్తే అర్థం అవుతుంది. ఇంతకీ ఆ సినిమాలేంటి ఎందుకు రిజెక్ట్ చేశారన్న‌ది ఇప్పుడు చూద్దాం.

ర‌వితేజ హీరోగా న‌టించిన నేల టికెట్ సినిమా ఆఫ‌ర్ మొద‌ట రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అయితే సినిమా క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో చ‌ర‌ణ్ సున్నితంగా తిర‌స్క‌రించారు. దాంతో ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ ర‌వితేజ‌ను సంప్ర‌దించారు. మాస్ మ‌హ‌రాజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్యామీనన్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఓకే బంగారం సినిమా మొద‌ట చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. ఈ ప్రేమ కావ్యానికి చ‌ర‌ణ్ నో చెప్పారు. దాంతో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు. ఇక ఈ సినిమా త‌మిళ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో మంచి విజ‌యం సాధించగా తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

నాని, సమంత జంట‌గా న‌టించిన ల‌వ్ ఎంట‌ర్టైనర్  ఎటో వెళ్లిపోయింది సినిమా కూడా మొద‌ట చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు చ‌ర‌ణ్ నో చెప్పేశాడు. దాంతో సినిమా నాని వ‌ద్ద‌కు వెళ్లింది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న లభించింది.

అంతే కాకుండా నాని హీరోగా వ‌చ్చిన కృష్ణార్జున యుద్దం కూడా మొదట రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అయితే చ‌ర‌ణ్ ఈ క‌థ‌కు నో చెప్ప‌డంతో ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ నానిని సంప్రదించారు. కాగా ఈ డ‌బుల్ యాక్ష‌న్ చిత్రం ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

అంతే కాకుండా బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అగ్నీప‌త్ సినిమా తెలుగులో రీమేక్ చేయాల‌ని భావించారు. బాలీవుడ్ లో హీరోగా హృతిక్ రోష‌న్ న‌టించ‌గా క‌ర‌న్ మ‌లోత్రా సినిమాను తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ ఆఫ‌ర్ రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద‌కు రాగా ఆయ‌న తిరస్క‌రించారు.దాంతో ఈ సినిమా ప‌ట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

More Related Stories