English   

సర్కార్ రిలీజ్ ఓ సంచలనం

Vijay’s Sarkar Releasing Worldwide in Huge Screens With a Record Theatres
2018-10-29 22:22:41

ఇది క‌దా ఇండియ‌న్ సినిమా స‌త్తా అంటే.. ముఖ్యంగా సౌత్ ఇండియ‌న్ సినిమా స‌త్తా అంటే. ఎలాగూ ఇప్పుడు బాహుబ‌లితో మ‌న సినిమా అంటే ఏంటో బాలీవుడ్ కు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు తమిళ సినిమాలు కూడా ఇదే చేసి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధం అయిన స‌ర్కార్ అయితే ఏకంగా 5 ఖండాల్లో విడుద‌ల‌వుతుంది. న‌వంబ‌ర్ 6న ఈ చిత్రం ఆకాశ‌మే అంచ‌నాలుగా వ‌స్తోంది. 5 ఖండాలు అంటే స‌రిపోలేదు.. 80 దేశాలు కూడా స‌ర్కార్ ఖాతాలో ఉన్నాయి. దానికితోడు 1200 స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఓ త‌మిళ్ సినిమాకు ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద రిలీజ్. ర‌జినీకాంత్ సినిమాల‌ను సైతం దాటేసింది ఈ చిత్రం ఇప్పుడు. ఇక తెలుగులో కూడా స‌ర్కార్ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

కొన్నేళ్ల కింది వ‌ర‌కు క‌నీస గుర్తింపు కోసం పాకులాడిన విజ‌య్.. ఇప్పుడు ఇక్క‌డ కూడా మార్కెట్ తెచ్చుకున్నాడు. తెలుగు దివాళిని స‌ర్కార్ మాత్ర‌మే కొల్ల‌గొట్ట‌డానికి సిద్ధ‌మైంది. ఈ చిత్ర టీజ‌ర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థ‌మైపోతుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్న ఈ త‌రుణంలో ఓటుహ‌క్కు ప్రాముఖ్య‌త తెలిపేలా ఈ సినిమా క‌థ ఉండ‌బోతుంది. విజ‌య్ కార్పోరేట్ కింగ్ గా న‌టిస్తున్నాడు. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఖచ్చితంగా మెసేజ్ కూడా స్ట్రాంగ్ గానే వెళ్తుంద‌ని భావిస్తున్నారు అభిమానులు. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తోన్న త‌ప్పుల‌ను నిల‌దీసేలా ఈ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తుంది. కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డం.. ఆలోచింప‌జేసే క‌థ ఉండ‌టం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశాలు. మ‌రి చూడాలిక‌.. ఇంత‌టి వైడ్ రిలీజ్ తో స‌ర్కార్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?

More Related Stories