English   

అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న నోటా.. 

vijay-devarakonda-NOTA
2018-09-22 13:42:30

విజ‌య్ అంటే ఇక్క‌డ త‌మిళ హీరో విజ‌య్ కాదు.. మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండే. గీత‌గోవిందం మ‌త్తు ఇంకా దిగ‌క‌ముందే మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు విజ‌య్. ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు ఉండే అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ హీరో.. ఇప్పుడు ద్విభాషా చిత్రం నోటాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం కూడా అప్పుడే విడుద‌ల‌కు సిద్ధ‌మైపోయింది. రెండేళ్ల కింద విక్ర‌మ్ తో ఇరుముగ‌న్ సినిమా చేసిన ఆనంద్ శంక‌ర్ దీనికి ద‌ర్శ‌కుడు. ఇప్పుడు అక్టోబ‌ర్ 5న నోటా సినిమాతో వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అప్పుడు విక్ర‌మ్ తో విభిన్న‌మైన పాత్ర చేయించిన ఆనంద్.. ఇప్పుడు విజ‌య్ ను ముఖ్య‌మంత్రిగా చూపిస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ జోడీగా న‌టిస్తుంది. స‌త్య‌రాజ్, నాజ‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌రొకండ‌కు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వ‌ర్ష‌న్ లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.  మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రంతో త‌మిళ‌నాట కూడా పాగా వేయాల‌ని చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలున్నాయి. ర‌వితేజ అమ‌ర్ అక్బర్ ఆంటోనీ వాయిదా ప‌డ‌టంతో అక్టోబ‌ర్ 5ని విజ‌య్ దేవ‌ర‌కొండ తీసుకున్నాడు.

More Related Stories