English   

నాని సినిమాకి 50 కోట్లా.. మైత్రి మూవీ మేకర్స్ సంచలనం..

Nani
2019-02-06 13:42:41

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దేవదాస్ ఫ్లాప్ అయినా కూడా ఎక్కడా తగ్గడం లేదు ఈ హీరో. వరస సినిమాలు ఒప్పుకుంటూ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె.కుమార్ తో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారు నాని. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. నాని 24వ సినిమా ఇది.. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం ఏకంగా 50 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. ఇందులో కథ అలా ఉంటుంది.. దాంతో బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. కానీ కథ ఉంది కదా అని హీరో మార్కెట్ తో పనిలేకుండా భారీ బడ్జెట్ పెడితే నష్టాలు తప్పవని ఇప్పటికే వాళ్లకు అర్థమైంది. రవితేజ మార్కెట్ తో పనిలేకుండా అమర్ అక్బర్ ఆంటోనీ భారీ బడ్జెట్తో నిర్మించారు.. కానీ అది దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది. దానికి ముందు సవ్యసాచి సినిమాకు కూడా ఇదే చేశారు మైత్రి మూవీ మేకర్స్. నాగచైతన్య మార్కెట్ పట్టించుకోకుండా భారీ బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి నాని సినిమాకు ఇదే చేయాలని చూస్తున్నారు. పైగా విక్రమ్ కె.కుమార్ సినిమాలకు పేరు వస్తుంది కానీ డబ్బులు రావు. ఇది దృష్టిలో పెట్టుకొని తగ్గించుకొని సినిమా చేస్తే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు విశ్లేషకులు. మరి ఇది మైత్రి మూవీ మేకర్స్ ఎంతవరకు అవుతుందో చూడాలి.

More Related Stories