English   

50కోట్ల క్లబ్ లో చేరిన మజిలీ !

 Naga chaitanya
2019-04-15 11:19:29

నాగ చైతన్య – సమంత జంటగా నటించిన మజిలీ సినిమా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఐదో రోజే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. తొలి వారంలో ‘మజిలీ’ రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టగా ఈ సినిమా 21 కోట్లకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నాగ చైతన్య కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మజిలీ నిలిచింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిన విషయాన్ని పేర్కొంటూ సినిమా యూనిట్ ఈరోజు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ 50 + ప్రపంచ గ్రాస్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

More Related Stories