English   

50 వేలు కూడా లేవు...చావండి : ఛార్మీ భావోద్వేగ స్పీచ్

chami
2019-09-29 19:31:33

సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాధ్ పుట్టిన రోజు పురస్కరించుకొని దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు పూరి కనెక్ట్స్ సహా నిర్మాత ఛార్మికౌర్. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా తన బర్త్ డే మెసేజ్‌ను చార్మి ద్వారా షేర్ చేశారు. అయన పంపిన మెసేజ్ ని చార్మి చదివి వినిపించింది.

ఆయన మెసేజ్ ప్రకారం ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అంటూ ఉంది.

ఇక ఈ మెసేజ్ చదివి వినిపించాక తన ఎమోషనల్ స్పీచ్‌తో అందరినీ గుండెల్ని టచ్ చేశారు ఛార్మి. అసలు ఈ సాయం ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాన్ని చెబుతూ అప్పట్లో దాసరి గారు పూరీ జగన్నాథ్ తన వారసుడు అని చెప్పారని ఆ మాట విన్న పూరీగారు తన దగ్గర చాలా ఎమోషన్ అయ్యారని చెప్పుకొచ్చింది. ఆరోజు దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు పూరీ తాను ఫైనాన్సియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నామని 50 వేలు మాత్రమే ఉన్నాయని ఆ టైంలో ఒకరికి ఒకరం బలంగా నిలబడ్డామని, ఈరోజు ఇలా మీ ముందు ఉన్నామంటే కారణ అది పూరి గారిని నమ్మి ఈ సినిమా చేసిన రియల్ హీరో రామ్ పోతినేని అని చెప్పుకొచ్చారు. రామ్ మాకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉండబట్టే ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఈరోజు మేము ఈ సాయం చేయగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. 

More Related Stories