English   

సైరా నరసింహారెడ్డి నష్టాలు 50 కోట్ల పైనే..

syeraa
2019-10-20 16:45:43

మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి తెలుగులో మాత్రమే సత్తా చూపించి మిగిలిన భాషలలో దారుణంగా నిరాశపరిచింది. చిరంజీవి నటించిన ఈ విజువల్ వండర్ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా దారుణంగా ప్లాప్ అయిపోయింది సైరా నరసింహారెడ్డి. ఒకటి రెండు కాదు ఏకంగా 50 కోట్లకు పైగా నష్టం తీసుకువచ్చేలా కనిపిస్తుంది మెగాస్టార్ సినిమా. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 110 కోట్లు వసూలు చేసింది సైరా నరసింహారెడ్డి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల వరకు వసూలు చేసింది. విడుదలైన తర్వాత ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 145 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమా దాదాపు 180 కోట్ల బిజినెస్ చేశాడు నిర్మాత రామ్ చరణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పితే సైరా సినిమా మరే భాషలోనూ సత్తా చాటలేకపోయింది.

హిందీలో అయితే పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటివరకు అక్కడ 5.5 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే సైరా పరిస్థితి అర్ధమవుతుంది. ఇక తమిళ, మలయాళ, కన్నడలలో కూడా పర్వాలేదనించిన సైరాకి ఇప్పటి వరకు 145 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ వారం కూడా తెలుగులో సినిమాలు ఏవీ పెద్దగా రాలేదు కాబట్టి సైరా పర్లేదు అనిపిస్తుంది. ఎటు చూసుకున్న కూడా సైరా నరసింహారెడ్డి సినిమాతో బయ్యర్లకు 50 కోట్ల నష్టాలు వచ్చినట్లే. మరి దీనిపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Related Stories