English   

అల - సరిలేరు 50 డేస్ ఫంక్షన్స్...ఎక్కడంటే

ala
2020-02-13 08:30:54

50 రోజులు..100 రోజులు సినిమాలు ఆడే రోజులు పోయాయి. ఒకప్పుడు అలా ఫంక్షన్స్ కూడా చేసేవారు. ఇప్పుడు మాత్రం అన్నీ బాక్సాఫీస్ లెక్క‌లే. వారం రోజుల్లో సినిమా ఎంత వ‌సూళ్లు చేసింది? మొద‌టి రోజు వ‌సూళ్లు ఎంత‌? వారాంతానికి ఎంత సాధించింది? ఇక ఫుల్ రన్ లో ఎంత సాధించింది అనేదే ఇప్పుడు హిట్ ఫార్ములా. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయ్యింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు మొదటి నుండి ప్రతి దానికి అంటే రిలీజ్ డేట్ దగ్గర్న నుండి ప్రతి దానికి పోటీ వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంటపురంలో సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆ సినిమా అయితే ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు మరో విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. అదేంటంటే 50 డేస్ ఫంక్షన్స్ విషయంలో. అవును ఈ రెండు సినిమా యూనిట్ 50 డేస్ ఫంక్షన్ విషయంలో కూడా ఇప్పుడు పోటీ పడుతున్నాయి. ముందుగా సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కర్నూలులో జరపాలని ప్లాన్ చేస్తుండగా, ఇప్పుడు అల ఈవెంట్ కూడా తిరుపతిలో జరపాలని ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

More Related Stories