English   

50 కోట్ల క్లబ్‌‌లో భీష్మ.. నితిన్ బాక్సాఫీస్ ఊచకోత..

 Bheeshma
2020-02-28 17:30:28

పెళ్లికి ముందు నితిన్ కు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది చెప్పండి. మూడేళ్లుగా ఒక్క విజయం కూడా లేని హీరో సరిగ్గా నిశ్చితార్థం చేసుకున్న వారం రోజుల్లోనే బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏడాదిన్నర నుంచి ఎలాంటి సినిమాలు చేయని నితిన్ భీష్మ సినిమాతో వచ్చి సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం తొలి వారంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే విషయాన్ని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. పోస్టర్స్ కూడా విడుదల చేసారు. ఇది చూసి నితిన్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. 

ఇప్పటికే తొలివారం తెలుగు రాష్ట్రాల్లోనే 20.30 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 25.50 కోట్లకు పైగానే తీసుకువచ్చింది. నితిన్ కెరీర్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. నైజాంలో 10 కోట్ల షేర్ వైపు పరుగులు తీస్తుంది భీష్మ. అన్ని ఏరియాల్లో రిపోర్ట్స్ ఉండటంతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు నితిన్. 

త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమాతో నాలుగేళ్ల కిందట తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదున్నర కోట్లకి పైగా షేర్ తీసుకొచ్చాడు నితిన్. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఈ రికార్డు అందుకోలేదు. ఇప్పుడు భీష్మ సినిమాతో త్రివిక్రమ్ రికార్డులను తిరగరాశాడు ఈ కుర్రహీరో. అయితే లాంగ్ రన్ లో అ..ఆ సినిమాను బీట్ చేయడం కష్టమే. నితిన్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అప్పుడు గురువు త్రివిక్రమ్ వచ్చి ఆదుకుంటే ఇప్పుడు మళ్లీ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయన శిష్యుడు వచ్చి నితిన్ కోరుకున్న విజయాన్ని అందించాడు.

More Related Stories