English   

సినీ కార్మికులకు రజినీకాంత్ 50 లక్షల విరాళం..

Rajinikanth
2020-03-24 18:13:21

కరోనా వైరస్ కారణంగా గత రెండు వారాలుగా సినిమా కార్మికులకు ఎలాంటి పనులు లేవు. దాంతో షూటింగ్ చేసుకుంటే తప్ప పూట గడవని సినిమా కార్మికులు ఎంతో మంది ఆకలి బాధతో అల్లాడిపోతున్నారు. వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీకి ఎంతైనా ఉంది. అందుకే ఇప్పుడు హీరోలు కూడా ఒక్కొక్కరుగా కదిలి వస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో కరోనా బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నితిన్ 20 లక్షలు ప్రకటించాడు. మరోవైపు డాక్టర్ రాజశేఖర్ కూడా సినిమా కార్మికులకు తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇక ప్రకాష్ రాజ్ తన దగ్గర పనిచేస్తున్న కార్మికులకు మే నెల వరకు ముందుగానే జీతాలు చెల్లించాలని చెప్పాడు. 

ఇక ఇప్పుడు తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కార్మికుల కోసం 50 లక్షలు విరాళం ప్రకటించాడు. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటున్నాడు సూపర్ స్టార్. ఈయన కంటే ముందే సూర్య కార్తీ బ్రదర్స్ కరోనా వైరస్ కారణంగా పని లేకుండా ఉన్న సినిమా కార్మికులను ఆదుకొనే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా ఇందులో అడుగుపెట్టాడు. ఈయనతో పాటు మరి కొందరు తమిళ హీరోలు కూడా విరాళం ప్రకటించారు. అందులో విజయ్ సేతుపతి 10 లక్షలు అనౌన్స్ చేశాడు. మిగిలిన వాళ్ళు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విరాళాలు ఎక్కువ అయితే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా స్టార్ హీరోలు సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెట్టడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. 

More Related Stories