English   

కరోనా కాటుకు మహేష్ బాబు 50 కోట్లు బలి...

Mahesh babu
2020-04-01 17:19:19

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు ఎంత కాదన్నా కూడా అన్నీ కలిపి 50 కోట్ల వరకు వెనకేసుకుంటున్నాడు. మొన్న విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాకు అన్నీ కలిపి మహేష్ ఖాతాలో దాదాపు 70 కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. అందులో ఆయన నిర్మాతగా కూడా ఉన్నాడు. దాంతో పాటు ఏరియా రైట్స్ తీసుకుంటున్నాడు.. అన్నింటికి మించి డిజిటల్ రైట్స్ లో కూడా భాగం తీసుకుంటున్నాడు. ఇలా అన్నీ కలిపి దాదాపు సినిమాకు 50 నుంచి 70 కోట్ల వరకు వస్తున్నాయి మహేష్ బాబుకు. ఇండస్ట్రీలో ఇంత భారీ పారితోషికం అందుకుంటున్నది ఈయన ఒక్కడే. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయే పరిస్థితి వచ్చేసింది. 

కరోనా కారణంగా పారితోషికాల్లో భారీ కోత పడేలా కనిపిస్తుంది. మేం తగ్గేది లేదు.. అంతే కావాలంటే మాత్రం కచ్చితంగా నిర్మాతలకు చుక్కలు కనిపించడం ఖాయం. ఆల్రెడీ ఇప్పటికే చాలా నష్టాలు వచ్చాయి. షూటింగ్స్ ఆగిపోయి.. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు నిర్మాతలు. ఇలాంటి సమయంలో తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చిన ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు భారీగానే పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. తేరుకోవడానికి కూడా కనీసం ఏడాది పట్టేలా కనిపిస్తుంది. దాంతో అమెరికా లోని తెలుగు వాళ్లు ఇప్పుడు ఉపాధి, వేతనాల కోతను ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా ఇష్టమొచ్చినట్లు ఇప్పుడు టికెట్స్ కొని సినిమాలు చూసే పరిస్థితి అస్సలు లేదు. దాంతో దాదాపు 20 నుంచి 30 కోట్ల మార్కెట్ పోయినట్లు తెలుగు సినిమాకు ఇప్పుడు. 

అందుకే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు రెమ్యునరేషన్ లో భారీ కోత పడేలా కనిపిస్తుంది. అయితే ఇప్పటికప్పుడు మన స్టార్ హీరోలెవరు సినిమాలు విడుదల చేయడం లేదు. అదొక్కటే కాస్త ఉపశమనం. ఏదేమైనా కూడా ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఒకప్పుడు ఇచ్చినట్లు వేలంవెర్రిగా పారితోషికాలు అయితే ఇవ్వరు నిర్మాతలు. అది స్టార్ హీరోలు కూడా అర్థం చేసుకుంటే అందరికీ మంచిదేమో.. లేదంటే అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా ఇప్పుడు కాస్త తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

More Related Stories