మహర్షి 50 డేస్.. 200 సెంటర్స్.. టైమ్ ఫర్ సెలబ్రేషన్స్..

200 సెంటర్స్.. 100 డేస్.. ఈ డైలాగ్ విన్న వెంటనే పోకిరి సినిమా గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు మహర్షి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కాకపోతే ఇక్కడ 100 రోజులు కాదు.. 50 రోజులు మాత్రమే. మహేష్ బాబు 25వ సినిమాగా వచ్చిన మహర్షి మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ సంబరాలు జూన్ 28 న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనున్నాయి. భరత్ అనే నేను తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈయన కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమా ఇదే కావడం విశేషం. వంశీ పైడిపల్లి కూడా ఊపిరి తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మహర్షి.
వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ సినిమా 200 కేంద్రాలలో జూన్ 27తో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. వీకెండ్ ఫార్మింగ్ నేపథ్యంతో పాటు రైతుల బాధలను ఈ చిత్రంలో చూపించాడు వంశీ పైడిపల్లి. ఇక మహేష్ బాబు నటన కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. మొత్తానికి సినిమా సాధించిన విజయంతో అనిల్ రావిపూడిపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సక్సెస్ సంబరాలకు మహేష్ బాబు అభిమానులు భారీగా హాజరు కానున్నారు.