English   

సుశాంత్ 50 నెంబర్లు మార్చాడట 

Sushanth
2020-06-22 07:20:15

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న తన బాంద్రా నివాసంలో బలవన్మరణం పాలయిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక  సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉండే నెపోటిజం అలాగే కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ ని 'కాయి పో చే' సినిమాతో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అభిషేక్ కపూర్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్ గురించి మాట్లాడుతూ అతనో వజ్రం లాంటివాడని  అతడ్ని కోల్పోవడమంటే చిన్న పిల్లాడిని కోల్పోయినట్టుందని ఆయన చెప్పుకొచ్చారు. అలానే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా 'కేదార్ నాథ్' సినిమా షూటింగ్ రోజుల్లో సుశాంత్ దాదాపు 50 ఫోన్ నంబర్లు మార్చి ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా సమయంలో మీడియా సహా అందరూ సారా అలీ ఖాన్నే అందరూ ఫోకస్ చేసేవారని తనను కనీసం పట్టించుకోవడం సుశాంత్ బాధ పడి ఉండచ్చని చెప్పుకొచ్చాడు. సుశాంత్ తో ఏడాదిన్నర పాటు మాట్లాడకుండా ఉన్నానని ఎన్నో మెసెజెస్ కాల్స్ చేసినా సుశాంత్ రెస్పాండ్ కాలేదని వెల్లడించాడు.   సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిసారిగా నితేష్ తివారీ దర్శకత్వం వహించిన 'చిచోర్' సినిమాలో నటించారు. 2019లో విడుదలయిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.

More Related Stories