English   

ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి 50 వేలు సాయం

 Chiranjeevi
2021-05-24 10:40:04

క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి క‌రోనా రోగులను ఆదుకునేందుకు త్వ‌ర‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇటీవ‌ల క‌ష్టంలో ఉన్న పావ‌ల శ్యామ‌ల‌కు .. అలాగే  కోరోనాతో మృతి చెందిన ప‌లువురు వీరాభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు అలాగే కోరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న అభిమానులకు ల‌క్ష‌ల్లో సాయం చేశారు. తన అభిమాని వార‌సులు పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు మెగాస్టార్. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా  సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు.

ఇంత‌కుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి  తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ అనారోగ్యంతో ఉన్నార‌ని ఆదుకోవాల‌ని కోర‌గా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్ కి అందజేశారు  సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ.. ఆప‌ద్భాంద‌వుడిలా ఈ క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో సాయం చేస్తున్న చిరంజీవి గారు.. క‌ష్టంలో మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు.. అని అన్నారు.

More Related Stories