English   

దారుణం.. అర‌పూట‌లో 500 కోట్ల సినిమా పైర‌సీ.. 

Rajinikanths-2.0
2018-11-30 11:28:43

ఇంతకంటే దారుణం ఎక్క‌డైనా ఉంటుందా..? ఇన్నేళ్లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా.. అలా థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన మూడు గంట‌ల్లోనే బ‌య‌ట ఆన్ లైన్ లో లీక్ అవుతుంటే.. పైరసీ చేస్తుంటే ఇక నిర్మాత‌లు ఎక్క‌డికి పోతారు..? ఇప్పుడు 2.0 పైర‌సీ చూసిన త‌ర్వాత అస‌లు నిర్మాత‌ల‌కు ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. అన్న‌ట్లుగానే.. వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగానే విడుద‌లైన రోజే నెట్ లో సినిమాను అప్ లోడ్ చేసారు. ఇప్పుడు దాన్ని తీసే విధానం కూడా లేదు. ఇప్ప‌టికే ఎవ‌రికి వాళ్లు లింకులు షేర్ చేసుకుని సినిమా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అస‌లే పైర‌సీ ఇప్పుడు కొంప ముంచేస్తున్న త‌రుణంలో ఇలా 500 కోట్ల సినిమాను కూడా వాళ్లు వ‌ద‌ల‌క‌పోవ‌డం దార‌ణ‌మే. ఈ మ‌ధ్యే విజ‌య్ స‌ర్కార్.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమాల‌ను విడుద‌ల రోజే నెట్ లో పెట్టేసి సంచ‌ల‌నం సృష్టించారు పైర‌సీ దారులు. పెడ‌తాం కాస్కోండి అంటూ చెప్పి మ‌రీ సినిమాల‌ను అప్ లోడ్ చేస్తుంటే చూస్తూ కూర్చోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు 2.0 సినిమాను కూడా లీక్ వీరులు హెచ్చ‌రించారు. 

ఈ సినిమా విడుద‌లైన గంట‌లోపే సైట్ లో అప్ లోడ్ చేస్తాం చూస్తుండండి అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్ర‌ముఖ పైరసీ వెబ్ సైట్ త‌మిళ్ రాక‌ర్స్. అన్న‌ట్లుగానే ఇప్పుడు చేసింది.. చేసి చూపించారు కూడా. దీనిపై శంక‌ర్ అండ్ టీం చాలా చ‌ర్చించి చ‌ర్య‌లు తీసుకోడానికి రెడీ అవుతున్నారు కానీ ఫ‌లితం మాత్రం లేకుండా పోయింది. ఈ పైర‌సీపై గ‌తంలోనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు త‌మిళ‌నాడు సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. నిర్మాత‌లే పైరసీకి స‌గం కార‌ణం అవుతున్నారంటూ చెప్పుకొచ్చారాయ‌న‌. ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌కు ఆశ‌ప‌డి త‌మ‌కు తెలియ‌ని దేశాల‌కు కూడా సినిమాల‌ను అమ్మేస్తున్నారని.. వాళ్ల నుంచి కంటెంట్ ను కొంద‌రు పైర‌సీ సైట్లు న‌డిపించే వాళ్లు భారీ మొత్తం కొంటున్నార‌ని.. అలా విడుద‌లైన రోజు సాయంత్ర‌మే సినిమాల‌ను నెట్ లో పెట్టేస్తున్నార‌ని చెబుతున్నాడు తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. ఆలోచిస్తుంటే ఈయ‌న చెప్పిన దాంట్లో కూడా నిజం లేక‌పోలేదు. నిర్మాత‌ల‌కు మ‌రీ అంత డ‌బ్బు ఆశ‌ కూడా ప‌నికిరాదు క‌దా..! అస‌లు ఆ దేశంలో త‌మ సినిమా చూస్తారో లేదో కూడా తెలియ‌కుండా రైట్స్ కోసం సినిమాను అమ్మేస్తే ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయి మ‌రి..!

More Related Stories