English   

543 కోట్ల‌తో మ్యాజిక్ చెయ్యబోతున్న శంక‌ర్

Rajinikanth-2.0
2018-09-13 14:25:35

మ‌న సినిమాల బ‌డ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్ స్టేజ్ దాటేసాయి. ఇంకా మాట్లాడితే మ‌న‌కంటే బాలీవుడ్ లో త‌క్కువ బ‌డ్జెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు మిన‌హాయిస్తే చిన్నాచిత‌క సినిమాల‌న్నీ సౌత్ సినిమాల కంటే త‌క్కువ బ‌డ్జెట్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక్క‌డ స్టార్ హీరోతో సినిమా చేయాలంటే త‌క్కువ‌లో త‌క్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క‌ను ప‌ది రెట్లు పెంచేసాడు శంక‌ర్. 2.0 సినిమా కోసం ఏకంగా 500 కోట్లు పెట్టిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది నిజంగా ఓ క‌ల‌. ఓ దక్షిణాది సినిమాకు 543 కోట్లు బ‌డ్జెట్ అనేది నిజంగా ఓ క‌ల‌. కానీ ఆ క‌ల‌ను ఇప్పుడు శంక‌ర్ తీరుస్తున్నాడు.

2.0ను హాలీవుడ్ సినిమాకు ధీటుగా తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ లో వ‌చ్చిన బ్యాట్ మ్యాన్.. డెడ్ పూల్ కూడా దీనికంటే త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కాయి. ఎక్స్ మెన్ సినిమా బ‌డ్జెట్ ఇప్పుడు రోబో సీక్వెల్ కు పెట్టిన బ‌డ్జెట్ ఒక్క‌టే. అక్ష‌రాలా 75 మిలియ‌న్.. అంటే 543 కోట్లు. న‌టీన‌టులు మిన‌హాయిస్తే.. ఈ సినిమాకు ప‌నిచేస్తోన్న సాంకేతిక నిపుణులంతా హాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేసిన వాళ్లే. 3000 మంది టెక్నీషియ‌న్స్ మూడేళ్ల పాటు క‌ష్ట‌ప‌డితే వ‌చ్చిన ఔట్ పుట్ 2.0. ఇప్పుడు దీన్ని ఇండియ‌న్ సినిమా అన‌డం కూడా భావ్యం కాదేమో. హాలీవుడ్ సినిమాలు కూడా బిత్త‌ర‌పోయేలా దీన్ని తెర‌కెక్కించాడు శంక‌ర్. 2.0 బ‌డ్జెట్ ఏ స్థాయిలో ఉందో.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో న‌డుస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే 500 కోట్ల బిజినెస్ పూర్తైపోయింది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. కేవ‌లం దీనికోసమే ఏడాదికి పైగా టైమ్ తీసుకుంటున్నాడు శంక‌ర్. సినిమాను అంతా 3డిలోనే తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. హాలీవుడ్ సినిమాల‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. అక్క‌డ 2డిలో చేసి 3డిలోకి మారుస్తారు. కానీ ఈయ‌న మాత్రం నేరుగా 3డిలో సినిమా చేసాడు. 2.0లో ఎంత ర‌జినీ, అక్ష‌య్ కుమార్ ఉన్నా కూడా ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం నిజంగా సేఫేనా అనే అనుమానం అంద‌ర్లోనూ వ‌స్తుంది. శంక‌ర్ ను చూసి చాలా మంది ద‌ర్శ‌కులు తాము కూడా సైన్స్ ఫిక్ష‌న్ తీస్తామంటూ వంద‌ల కోట్ల బ‌డ్జెట్ అడిగితే నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంటి..? అంద‌రూ శంక‌ర్ అవ్వ‌లేరు క‌దా.. అంత‌వ‌ర‌కు ఎందుకు.. రోబో త‌ర్వాత శంక‌ర్ చేసిన ఐ సినిమానే స‌రిగ్గా ఆడ‌లేదు. మొత్తానికి మ‌రి 2.0 ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

More Related Stories