English   

55 ఏళ్ల సురేష్ ప్రొడక్షన్స్....ఓ బేబీ ఫస్ట్ లుక్ !

oh baby
2019-05-21 21:45:16

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినీ నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డీ డా.డి. రామానాయుడు. ఈ సంస్థ ఇదే రోజున అనగా మే 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' సినిమా విడుదలై నేటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తయింది. ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ లో నిర్మిస్తున్న `ఓ బేబి` సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. గ్లామర్ పాత్రలు లాంటి మూస పాత్రలకి పరిమితం కాకుండా త‌న న‌ట‌న‌తో అందరినీ ఆకట్టుకుంటున్న స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ఓ బేబీ. ఈ సినిమాని నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. షూట్ అంతా పూర్తయిన ఈ సినిమా జూలైలో విడుద‌లకి సిద్దం అవుతోంది. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించారు.

 

More Related Stories