English   

 విక్రమ్ 58 మొదలవుతోంది !

 Ajay Gnanamuthu
2019-05-21 12:22:47

ఎప్పుడూ విభిన్న క‌థల‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో విక్ర‌మ్. ఆయ‌న తాజాగా న‌టించిన మూవీ ‘కదరం కొండన్’. ఈ సినిమా  ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. రాజేష్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫేసర్ గా నటిస్తున్నాడు విక్రమ్. కమల్ హాసన్ రెండో కూతురు అక్షరా హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాని మే 31న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. సూర్య ఎన్జీకే సినిమా, ఈ సినిమా రెండూ ఓకే రోజు రిలీజ అవుతున్నాయని తెలిసే విజయ్ దేవరకొండ సినిమా వాయిదా వేసుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే విక్ర‌మ్ త‌న 58వ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్‌’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ ల‌ని అందించిన అజయ్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 58వ చిత్రం చేయ‌నున్నాడు విక్ర‌మ్. అయితే ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానరు మీద వయాకమ్‌ 18 స్టూడియోస్‌ సహ నిర్మాణమ్ లో లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాని ఏకకాలంలో త‌మిళం, హిందీ, తెలుగు భాష‌ల‌లో తెర‌కెక్క‌నుండ‌గా, 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగ‌స్ట్‌లో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. 

More Related Stories