English   

పిచ్చెక్కించిన అనుప‌మ‌..6 గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్

Anupama-Parameswaran
2018-09-18 11:00:19

జ‌డేసుకోలేక‌పోయావా అమ్మా.. ప‌ద్ద‌తిగా ఉండేది.. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావ‌నుకో అంటూ అప్ప‌ట్లో అనుప‌మ‌ను ఉద్దేశించి అ..ఆ..లో ఓ డైలాగ్ రాసాడు త్రివిక్ర‌మ్. అప్పుడు చాలా ప‌ద్దతిగా.. స‌న్న‌గా మెర‌పుతీగ‌లా క‌నిపించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. రెండేళ్లు తిరిగేస‌రికి అనుప‌మ కాస్తా అనుబాంబులా మారిపోయింది. మెరుపుతీగ కాస్తా బొద్దుగుమ్మ‌గా మారిపోయింది. ఇక్క‌డి నీళ్ల‌తో పాటు ఫుడ్డు కూడా బాగా ప‌డిన‌ట్లుంది అందుకే బాగా ఒళ్లు చేసింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే టీజ‌ర్ లో అనుప‌మ‌ను చూసిన త‌ర్వాత కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌దేమో..? అంత హాట్ గా చంపేసింది ఈ క్యూటీ. ఏం చూపించ‌లేదు.. అలాగ‌ని ఏం దాచుకోనూ లేదు. చూపించి చూపించ‌కుండానే అన్నీ చూపించి పై ప్రాణాలు పైనే తీసేసింది అనుప‌మ‌. 

ఇలా ఆమెను చూసిన త‌ర్వాత బాబోయ్ ఏం భామ‌రోయ్ అన‌కుండా ఉంటారా.. యూ ట్యూబ్ లో క్లిక్కులు చేయ‌కుండా ఉంటారా..? అందుకే ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి ర‌య్ మంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంది. విడుద‌లైన తొలి 6 గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ సాధించింది హ‌లో గురు ప్రేమ‌కోస‌మే టీజ‌ర్. ఇదంతా అను అందాల మ‌హిమే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టీజ‌ర్లోనే ఇలా ఉంటే రేపు సినిమాలో ఇంకెలా ఉండ‌బోతుందో.. ఈ సినిమాతోనే అనుప‌మ అందాల తాళం ఓపెన్ చేసిందేమో అనే ఆస‌క్తి కూడా మొద‌లైందిప్పుడు. ఇదే కానీ నిజ‌మైతే కేవ‌లం అనుపమ కోస‌మే సినిమా చూసే ప్రేక్ష‌కులు చాలా మంది ఉంటారు. అక్టోబ‌ర్ 18న ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. సినిమాలో అను అందాల‌న్నీ ఎలా ఉండ‌బోతున్నాయో..? ఎవ‌రేం అనుకున్నా మొత్తానికి త్రినాథ‌రావ్ ఏం చెప్పి ఒప్పించాడో కానీ అనుప‌మ‌ను మాత్రం పిచ్చ హాట్ గా చూపించేసాడు. 

More Related Stories