English   

సరిలేరు నీకేవ్వరు 6 రోజుల కలెక్షన్స్...నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్

Sarileru Neekevvaru
2020-01-17 10:45:06

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి రోజు మొదటి ఆట నుండే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది.  పాజిటివ్ టాక్‌తో విడుదలైన ఈ చిత్రం  తొలి రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ.46.7 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక రెండోరోజు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైనా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందంటే మహేష్ సినిమా జనాల్లోకి ఎంత బాగా వెళ్లిందో మీరు అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా పండుగ మూడు రోజుల్లో కూడా తన హవా కంటిన్యూ చేసింది. ఈ సీజన్ మొత్తంలో అన్ని ఏరియాల్లో దుమ్ము దులిపింది.

ఏకంగా ఆరు రోజుల్లో నాన్ బాహుబాలి రికార్డ్స్ సృష్టించింది అన్ని ఏరియాల్లో. డే సిక్స్ కలెక్షన్స్ చూస్తే నిజాం : 25.65, సీడెడ్ :  11.35, ఉత్తరాంధ్ర : 11.8, గుంటూరు : 7.72, ఈస్ట్ : 7.23, వెస్ట్ : 5.06, కృష్ణా : 6.27, నెల్లూరు :  2.86 మొత్తం ఆరు రోజుల షేర్ - 77.94 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పండగ కలిసిరావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పంట పండిందనే చెప్పాలి.

More Related Stories