English   

అల వైకుంఠపురములో 6 డేస్ కలెక్షన్స్...నాన్ బాహుబలి రికార్డ్ అంతే !

ala
2020-01-18 20:26:41

ఈ ఏడాది టాలీవుడ్ కి మంచి శుభారంభం లభించింది. విడుదలయిన అన్ని సినిమాలు మంచి టాక్ రావడమే కాక మంచి మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళుతున్నాయి. ఇక అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. విడుదలైన ఫస్ట్ డే నుంచే  బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది ఈ సినిమా. ఇంకా దానిని ప్రమోట్ చేసుకునే పనిలో పడింది యూనిట్. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ రోజు రోజుకీ పెంచుతోంది. తాజాగా అలవైకుంఠపురములో సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు రోజులకి గాను 104 కోట్ల షేర్ వసూలు చేసినట్టు కొద్ది సేపటి క్రితం యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వేగంగా బన్నీ 100 కోట్ల షేర్స్ అందుకున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133 కోట్లు చేయగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 30 కోట్ల దాకా సంపాదించాలి. ఈ వీకెండ్ రెండు రోజులు కూడా ఉండడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కూడా కొనసాగుతుండడంతో ఆదివారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ అందుకోగలదని అంటున్నారు. యూఎస్ లో కూడా సినిమాపై డాలర్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా యూఎస్ లో ఈ 2 మిలియన్స్ డాలర్స్ ని క్రాస్ చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. 

More Related Stories