English   

మహేష్ బాబు చెప్పిన 6 సూత్రాలు పాటిస్తే కరోనా దూరం..

maheshbabu
2020-03-25 19:23:08

ఉగాది శుభాకాంక్షలు చెప్తూనే.. సెలెబ్రిటీస్ అంతా ప్రజలను ఇంట్లోనే ఉండాలని.. కరోనా నుంచి కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇదే చేసాడు. తన ట్విట్టర్‌లో అభిమానుల కోసం ఆరు సూత్రాలను పోస్ట్ చేసాడు. ఇలా చేస్తే కరోనా రాదంటూ చెప్పుకొచ్చాడు ఈయన. ఈ పరిస్థితుల్లో ఈ ఆరు గోల్డెన్ రూల్స్ పాటించాలని తను అందర్నీ కోరుకుంటున్నానని చెప్పాడు సూపర్ స్టార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలని కోరాడు. మరి మహేష్ చెప్పిన ఆరు సూత్రాలు ఏంటో తెలుసా..?

1. అన్నింటికంటే ముఖ్కమైంది.. జనం అంతా ఇంట్లోనే ఉండాలి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి..
2. కనీసం 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోవాలి..
3. మీ మొహాన్ని తాకకండి.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును అసలు తాకకండి..
4. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కచ్చితంగా మీ మోచేతులను లేదంటే టిష్యూను అడ్డుగా పెట్టుకోండి..
5. సోషల్ డిస్టేన్సింగ్ అనేది తప్పదని అర్థం చేసుకోండి.. ఇంట్లో అయినా బయట అయినా ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండండి..
6. మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్‌ని ధరించండి.. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి వైద్యున్ని సంప్రదించండి.. నమ్మదగిన సోర్సు నుంచే వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి.. కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దామంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్.

 

More Related Stories