English   

సెప్టెంబ‌ర్‌ 6న ఆది పినిశెట్టి ‘క్లాప్’ టీజ‌ర్‌

Aadi pinisettys clap teaser will be released on september 6th
2021-09-03 22:15:31

హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్  ‘క్లాప్‌’. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్)- ఎం. రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 6న విడుదలకానుంది. ఈసంద‌ర్భంగా విడుద‌ల‌ చేసిన‌ పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ  పోస్ట‌ర్లో ఆది  స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ తో పాటు ప్రస్తుతం జరుగుతోన్న పారా ఒలింపిక్స్ లో మన దేశం మంచి ప్ర‌తిభ‌ను ప్రదర్శిస్తున్న సమయంలో ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీలోఆది స్ప్రింటర్‌గా క‌నిపించ‌డానికి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆకాంశ సింగ్ కథానాయికగా నటిస్తుండగా, కృష్ణ కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్ కీల‌క‌పాత్ర‌ల‌లో కనిపిస్తారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

More Related Stories