వీ6కి గుడ్ బై చెప్పిన సత్తి....టీవీ9లో చేరిక ?

వీ6 ఛానెల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిత్తిరి సత్తి, ఆయన అసలు పేరు రవి అనే విషయం కూడా చాలా మందికి తేలేదు. ఆయన సత్తి పేరుతోనే అంత ఫేమస్ అయిపోయాడు. అంతకు ముందు అడపాదడపా కొన్ని టీవీ చానెల్స్ ప్రోగ్రామ్స్ లో ఆయన మెరిసినా ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది సత్తి క్యారెక్టర్. తనదైన శైలిలో తెలంగాణా యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్న బిత్తిరి సత్తి వల్లే వీ6కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. అయితే అనూహ్యంగా వీ6 చానల్‌కు గుడ్‌బై చెప్పిన సత్తి అందరికీ షాక్ ఇస్తూ టీవీ9 ఆఫీసులో కనిపించాడు. అదీకాక టీవీ9 రజనీకాంత్ నుండి నియామకపత్రం అందుకుంటున్న ఆ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే సత్తి టీవీ9లో చేరిక నిజమే అనే వార్త హల్చల్ చేస్తోంది.
అయితే గతంలో శివజ్యోతి అలియాస్ సావిత్రి బిగ్ బాస్ కోసం వీ6ను వదిలిపెట్టాక ఆమె సావిత్రి అన్న పేరును ఎక్కడా వాడుకోవడానికి వీలు లేకుండా వీ6 కట్టడి చేసింది. ఈ క్రమంలోనే సత్తి కూడా ఆ పేరును వదిలి మరొక పేరుతో టీవీ9 లో మెరుస్తాదా అనేది చూడాలి. అలాగే బిత్తిరి మాటలు చేష్టలతో జనానికి అలవాటు అయిన సత్తి ఆ గెటప్ లో కాకుండా కొత్త పేరుతో కొత్త గెటప్ లో మళ్ళీ జనానికి ఏమాత్రం దగ్గరవుతాడు అనేది చూడాలి. ఇక ఇక సత్తిని టీవీ9లోకి రప్పించేందుకు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఉంటారని కూడా తెలుస్తోంది. మొన్నటివరకూ వరకూ టీఆర్ఎస్ లో ఉన్న వీ6 ఛానల్ అధినేత ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడంతో సమీకరణాలు మారుతున్నట్టు, నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ అనుకూల స్టాండ్ తీసుకున్న వీ6 కొన్నిరోజులుగా ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది, ఇదే సమయంలో టీవీ9 ఇటీవల కేసీఆర్ సన్నిహితుడుగా పేరున్న రామేశ్వరరావు చేతికి వెళ్లడంతో సత్తి ఇదే సేఫ్ ప్లేస్ అనుకుని ఇక్కడకి వచ్చేసినట్టు చెబుతున్నారు.