English   

కాజల్‌ ని కలిపిస్తానని 60 లక్షలు నొక్కేసిన నిర్మాత!

 Kajal Aggarwal
2019-08-02 11:55:13

సినీ తారలు అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. వారిని కలవాలని కలిసి మాట్లాడాలని, వారితో ఫోటో దిగాలని కొందరికి ఉంటె వారిని ఏకంగా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అయినా అవన్నీ కుదిరే పనులా చెప్పండి. కానీ ఈ లాజిక్ మిస్సయిన ఒక వ్యక్తి  మాత్రం ఏకంగా డెబ్బై ఐదు లక్షలు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రామనాథపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు (27) ఓ నెట్ చూస్తుండగా ఒక వెబ్‌సైట్ లో సినీ తారల అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆసక్తికొద్దీ కాజల్ అగర్వాల్ ఫొటోపై క్లిక్ చేయగా ఆమెను కలుసుకోవాలంటే 50 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం వారు సూచించిన ఖాతా నంబరులో అంత మొత్తాన్ని జమచేశాడు. అంతే ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు కాజల్‌ను కలుసుకునే అవకాశం కల్పించకపోగా, మార్ఫింగ్ చేసిన అసభ్యకర వీడియోలు, ఫొటోలను పంపి తాము అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో భయపడిన యువకుడు పలు దఫాలుగా 60 లక్షలు వారికి సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి నుంచి హెచ్చరికలు వస్తుండడంతో ఇంటి నుంచి పారిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత యువకుడు కోల్‌కతాలో ఉన్నట్టు ఫోన్ ద్వారా గుర్తించి తీసుకొచ్చారు. ఎందుకు వెళ్ళావని ప్రశ్నించగా వెబ్‌సైట్ నిర్వాహకుల తతంగం అంతా చెప్పాడు. దీంతో అతడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా మణికంఠన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతను ఓ సినీ నిర్మాత పేరు చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఆ నిర్మాతను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

More Related Stories